మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల కమిషన్ నిబంధలను ఉల్లంఘించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో ఓటు హక్కు వేశారు. అయితే, పోలింగ్ కేంద్రంలోకి బీఆర్ఎస్ పార్టీ కండువాతో వెళ్లడం ఏంటని.. ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అనేది వేచి చూడాలి.. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టారు. ముఖ్యంగా ఉదయమైతే రద్దీ తక్కువగా ఉంటుందని సినీ రాజకీయ ప్రముఖులు సైతం పోలింగ్ కేంద్రాల దగ్గరకు చేరుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.