తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది. వారిలో మహిళలు 221 మంది కాగా, పురుషులు 2,068 మంది, ఒక ట్రాన్స్ జెండర్. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య కోటి 62 లక్షల 98 వేల 418. మహిళా ఓటర్లు…
తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
రైతు బంధును అనుమతిని ఎన్నికల కమిషన్ రద్దు చేయడంతో బీఆర్ఎస్ ఎంపీ కే. కేశవ్ రావు స్పందించారు. ఇది ప్రజలకు సంబంధించిన విషయం.. ఇది ఏ పార్టీలకు సంబంధించినది కాదు అని తెలిపారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.
తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లున్నారు. దీంతో.. వారందరికీ సరిపోయేలా.. 35వేల 635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ఈసీ. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను ఈసీ సిద్ధం చేసింది.
రేపే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రాజస్థాన్లో 200 నియోజకవర్గాలు ఉండగా.. 199 స్థానాలకు ఒకేరోజు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 51 వేల 756 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ సారి సాధారణ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ చేస్తున్నామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. బ్యాలెట్ పేపర్ ముద్రణ జరిగిందని, ఈవీఎం బ్యాలెట్స్ ప్రింట్ కూడా అయ్యాయన్నారు. 36 వేల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు.
ఐదు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన రూ.1,760 కోట్ల విలువైన ఉచితాలు, డ్రగ్స్, నగదు, మద్యం, విలువైన లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం వెల్లడించింది.