భారతదేశం వ్యాప్తంగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావిడి కోలాహాలంగా జరుగుతోంది. ఇప్పటికే దేశంలోని అన్ని పార్టీలు జరగబోయే ఎన్నికల్లో గెలవడానికి పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజలను మమేకం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలకు మొత్తం 7 దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడత ఎన్నికలకు సంబంధించి బుధవారం నాడు ఎన్నికల ప్రచారం కు చెక్ పడింది. శుక్రవారంనాడు జరగబోయే ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది.
Also Read: PBKS vs MI: అర్జున్ టెండూల్కర్ కోసం అతనిపై వేటు.. ముంబై తుది జట్టు ఇదే!
ఇక ఇందులో తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ స్థానాలలో, రాజస్థాన్‌లో 12, యూపీలో 8, మధ్యప్రదేశ్ లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సామ్ రాష్ట్రాల్లో 5 స్థానాలలో.. బిహార్, పశ్చిమ బెంగాల్ లో 3 స్థానాల చొప్పున.. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లలో 2 లోక్ సభ స్థానలతో పాటు ఛత్తీస్ ఘడ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర , జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్క లోక్ సభ సీట్లకు ఏప్రిల్ 19 శుక్రవారం నాడు ఎన్నికల జరగనున్నాయి.
Also Read: Nominations: నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఇక ఈ మొదటి విడతలో జెరిగే ఎన్నికలలో అభ్యర్థులను చూస్తే.. 8 మంది కేంద్ర మంత్రులు., ఇద్దరు మాజీ సీఎంలు., తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై సహా పలువురు రాజకీయ హేమాహేమీలు బరిలో ఉన్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ స్థానం నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరి మూడోసారి బరిలో దిగనుండడంతో.. ఈసారి విజయంతో ఎలాగైనా హాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక తమిళనాడు లోని చెన్పై సెంట్రల్ నుంచి తమిళ సై సౌందరరాజన్, ఉత్తరాఖండ్ నుంచి మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ లు పోటీలో ఉన్నారు.