దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం మరింత హీటెక్కింది. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని ప్రత్యర్థులపై గెలిచి చట్ట సభల్లో అడుగు పెట్టాలనే లక్ష్యంతో అన్ని పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. కాగా, లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ కూడా దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రచారంలో బిజీబిజీగా ఉన్న నేతలంతా నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ రోజు మాత్రమే గడువు ఉందని ఎన్నికల కమిషన్ తెలిపింది. రేపటి (శుక్రవారం) నుంచి నామినేషన్ల పరిశీలన ఉండగా.. నామినేషన్ల ఉపసంహరకు ఈనెల 29వ తేదీ వరకు గడువు ఉందని ఈసీ చెప్పుకొచ్చింది. ఇక, వచ్చే నెల 13వ తేదీన పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీతో పాటు లోక్ సభకు పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆరోజే ఫలితాలను విడుదల చేయనున్నారు.
Read Also: Amit Shah: నేడు రాష్ట్రానికి అమిత్ షా.. షెడ్యూల్ ఇదీ..
కాగా, దేశవ్యాప్తంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది. అయితే పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు నేడే లాస్ట్ డే. ఈ రోజుతో నామినేషన్ పత్రాలు సమర్పించని వారు పోటీకి అనర్హులుగా ఉండిపోతారు. ప్రచారంలో బిజీగా ఉన్న నాయకులు నామినేషన్లు వేయాలంటూ మరోసారి ఈసీ వెల్లడించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. లోక్ సభ ఎన్నిలకపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి.. బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే.. ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.