దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత శుక్రవారమే జరగనుంది. అయితే కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే వారం పాటు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. మరోవైపు వాడగాల్పుల కారణంగా పోలింగ్ శాతం పడిపోతుందని నిపుణులు కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐఎండీ చీఫ్‌తో ఎన్నికల సంఘం చర్చలు జరిపింది. వాడగాల్పులు ఎక్కువగా వీచే రాష్ట్రాల్లో బీహార్ కూడా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయాన్ని ఈసీ పొడిగించింది. రెండు గంటల పాటు అదనంగా సమయం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Budi Muthyala Naidu: డిప్యూటీ సీఎం ఇంట్లో రాజకీయ కుంపటి..! ఒకే స్థానం నుంచి బరిలోకి అక్క, తమ్ముడు..!
హీట్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎన్నికల సమయాన్ని రెండు గంటల పాటు పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం.. బంకా, మాధేపురా, ఖగారియా, ముంగేర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంది. అయితే వేడిగాలుల దృష్ట్యా పోలింగ్ శాతాన్ని పెంచేలా ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని పొడిగించాలని బీహార్ ప్రధాన ఎన్నికల అధికారి కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆ నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ సమయాన్ని మార్చాలని నిర్ణయించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమయాన్ని.. రెండు గంటల పాటు పొడిగించింది. అంటే సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Shocking Video: ఉన్నట్టుండి ఎంత ఘోరం.. గోడపడి నలుగురి దుర్మరణం.. వీడియో వైరల్..