ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున మొదలైన గొడవలు ఇంకా చల్లారలేదు. అక్కడక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఘర్షణలపై సిట్ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈసీకి నివేదిక కూడా అందజేసింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న గొడవలపై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం, దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన లేఖ రాసిందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Rakul Preet Singh: ఆగ్రహంతో రెచ్చిపోయిన రకుల్ తండ్రి.. అది నా కూతురి కష్టం అంటూ..
‘‘ఏపీలో అల్లర్లు, అలజడులను ఆపడంలో సీఎస్ విఫలమయ్యారు. డీజీపీని మార్చినప్పుడు సీఎస్‌ను ఎందుకు మార్చలేదు. సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. జవహర్ రెడ్డి సీఎస్‌గా ఉంటే కౌంటింగ్‌లో అక్రమాలు జరిగే అవకాశం ఉంది. జవహర్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశాం. జవహర్ రెడ్డి నిన్న వైజాగ్‌కు రహస్యంగా ఎందుకు వెళ్లారో తెలియడం లేదు. సిట్ దర్యాప్తు సరిగ్గా లేదు. పులివర్తి నానిపై దాడి చేసిన కేసులో అమాయకులను అరెస్టు చేశారు.’’ అని కిరణ్ రాయల్ ఆరోపించారు.
ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అనంతరం రాష్ట్రంలో ఆయా చోట్ల గొడవలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. వందలాది మంది గాయాలు పాలయ్యారు. మరికొందర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Pawan singh: భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ వేటు