Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ముద్ర ఒకటి ఉంటుంది.. అదే సిరా గుర్తు. ఎప్పుడైనా ఆలోచించారా సిరా మరకల వెనక ఉన్న కథ గురించి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ సిరా ముద్ర సందడి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇందులో హైలెట్ ఏంటంటే భారతదేశం నుంచి ఈ సిరాను ముప్పై ఐదు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ సిరా కథ ఏంటి, ఎన్నికలకు దీనికి మధ్య సంబంధం ఏంటి, ఎప్పటి నుంచి ఈ సిరాను…
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR ను ప్రకటించారు. ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. SIR నవంబర్ 4న ప్రారంభం కానుంది. తుది ఓటర్ల…
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (నవంబర్ 11) కోసం స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. బహుళ అభ్యర్థుల మధ్య ప్రతిష్ఠాత్మక రాజకీయ గుర్తులు గందరగోళానికి కారణం కాకుండా ఉండాలని BRS (భారత రాష్ట్ర సమితి) కోరినప్పటికీ, ‘చపాతి రోలర్’, ‘కెమెరా’, ‘షిప్’ వంటి గుర్తులు స్వతంత్ర అభ్యర్థులకే కేటాయించబడ్డాయి. ఈ గుర్తులు BRS ‘కారు’ గుర్తుకు పోలి ఉంటాయని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. జూలైలో BRS సీనియర్ నేతలు బి.…
SIR 2025: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేదీలను ప్రకటించడానికి సోమవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం (ECI) విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశం సోమవారం సాయంత్రం 4:15 గంటలకు జరుగుతుందని వెల్లడించారు. సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు పాల్గొని వివరాలను వెల్లడిస్తారని తెలిపారు. READ ALSO: Baahubali The Epic : బాహుబలి…
Supreme Court: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో విపక్షాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’ కార్యక్రమం ద్వారా ఫేక్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్యను కాంగ్రెస్, ఆర్జేడీ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సుప్రీంని ఆశ్రయించాయి.
Bihar SIR: వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత, బీహార్ తుది ఓటర్ జాబితా మంగళవారం రిలీజ్ అయింది. భారత ఎన్నికల కమిషన్(ECI) బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను ప్రచురించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఓటర్ జాబితా ఆధారంగా నిర్వహించబడుతాయి.
Election Commission: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల లే అవుట్ మార్చడానికి ఈసీ నిర్ణయించుకుంది. ఎన్నికల నిర్వహణ నియమాలు-1961లో నియమం 49B ప్రకారం, అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు కలర్లో ముద్రించనున్నారు.
Voter roll revision: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసే లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకటన రావచ్చు. కాన్ఫనెన్స్ కమ్ వర్క్ షాప్ సందర్భంగా ఓటర్ జాబితా సవరణకు ఎంత త్వరగా సిద్ధంగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అడిగినట్లు…
ఢిల్లీ – భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ఈసీ అధికారులతో సమావేశం అయింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ, నూతన సంస్కరణలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై కేంద్ర…