Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
Lok sabha elections 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలైంది. మొదటి దశ ప్రచార పర్వం బుధవారంతో ముగిసింది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి.
లోక్‌సభ ఎన్నికలు 2024 నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, విలువైన వస్తువులు భారీగా పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) రికార్డు స్థాయిలో డబ్బును సీజ్ చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు 45 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా రూ.4,650 కోట్ల విలువైన డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర తాయిలాలను ఈసీ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల ప్రచారంలో స్వాధీనం చేసుకున్న రూ.3,475 కోట్లతో పోలిస్తే.. ఈసారి 34 శతం…
PM Modi: సిక్కు, హిందువుల దేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో ఓట్లు వేయించుకున్న ప్రధాని నరేంద్ర మోడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే దాఖలు చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
భారత్‌లో ఎన్నికల వాతావరణం మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు తుది తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించలేదు.. ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది అనే తప్పుడు వార్తను ఈసీ ఖండించింది.
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఉన్నట్టుండి రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది..