సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో భారీ ర్యాలీతో అదరగొట్టారు.
Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని), టీడీపీ సీనియర్ నాయకుడు వంగవీటి రాధ, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్‌లు ప్రచారంలో పాల్గొననున్నారు..
ఇవాళ (శనివారం) దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో చేయనున్నారు. ఆ రోడ్ షోలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కె.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండు వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ వన్ నుండి మొదలైన బైక్ ర్యాలీ 9వ ఫేస్ వరకు కొనసాగింది. ఈ బైక్ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి మద్దతుగా నిలుస్తూ అడుగున అడుగున…
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలో.. ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాగా.. కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ ప్రచారం నిర్వహించారు. కైకలూరు మండలం వెలమపేటలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు.