Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో మనీల్యాండరింగ్ కు పాల్పడిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలకు నా ధన్యవాదాలు.. మన దేశానికి 4 వేల ఏళ్లు నిండాయి.. కానీ, ప్రస్తుతం మన దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. అయితే ఈ దేశంపై ఎవరైనా నియంతృత్వాన్ని ప్రయోగించాలని ప్రయత్నించినా ప్రజలు సహించరు అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ ఆరాచక శక్తుల మీద పోరాటం చేస్తున్నాను అని పేర్కొన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కలిసి ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఓడించాలి అని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
కాగా, ఇవాళ (శనివారం) దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షో చేయనున్నారు. ఆ రోడ్ షోలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు. కాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత.. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక, కేజ్రీవాల్ హనుమాన్ ఆలయానికి వస్తుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.