జమ్ముకాశ్మీర్‌లో జరుగుతున్న ఎన్నికల కార్యకలాపాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు (గురువారం) పరిశీలించనున్నారు. బారాముల్లా, అనంత్‌నాగ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
నేడు ( గురువారం ) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అజంగఢ్, జౌన్‌పూర్, భదోహి, ప్రతాప్‌గఢ్‌లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మంగళవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బుధవారం (రేపు) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒరిస్సా రాష్ట్రంలోని బోలంగిర్ లోక్ సభ పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బొలంగిర్ లోక్ సభ స్థానానికి చేరుకోనున్నారు.
రాహుల్ గాంధీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. కాగా.. రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. పెళ్లి గురించి ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టత ఇచ్చారు.
Lokshabha Elections 2024: రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సోమవారం (మే 13) ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గంటల తరవాత స్థానికేతరులు కానీ.. రాజకీయ నేతలంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. అనకాపల్లి, అనంతపురం, ప.గో, తూ.గో, కర్నూలు జిల్లాల్లో నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6…
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని, తొలి మంత్రి పదవి హామీ ఇచ్చారు సీఎం జగన్. మరోవైపు.. కుప్పం భరత్ ను కూడా మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దత్త పుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త…
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గం వీఆర్పురం మండలం మారుమూల గ్రామాలలో ఎన్డీఏ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత, రంప చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి రోడ్డు షో ప్రచారం నిర్వహించారు. రోడ్డు పొడవునా ప్రజలు బారులు తీరి.. ఆదివాసి గిరిజనులు హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో పాటు.. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరై నినాదాలు చేశారు.
ఏలూరు జిల్లా కైకలూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 36 గంటల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం జరిగే ఎన్నికలు కావని పేర్కొన్నారు. ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలు అన్నారు. జగన్కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని తెలిపారు. ఇంటింటి అభివృద్ది చేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని సీఎం జగన్ చెప్పారు.…