CM YS Jagan: పిఠాపురంలో ప్రచారాన్ని ముగించనున్న సీఎం జగన్.. నేటి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. వైనాట్ 175 అంటున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ పిఠాపురంలో ఆఖరి అస్త్రాన్ని సంధించబోతున్నారు. ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు సీఎం జగన్. ఉదయం పది గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. ఒంటి గంటకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కైకలూరులో సభలో పాల్గొంటారు. చివరగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోని పిఠాపురంలో నిర్వహించే సభలో పాల్గొని ప్రచారాన్ని ముగిస్తారు సీఎం జగన్.
Read Also: Crime: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నూతన వరుడితో సహా నలుగురు సజీవ దహనం
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
అయితే, మొదటి నుంచీ వైసీపీ పిఠాపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. అక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో.. ఆయనపై అదే సామాజికవర్గానికి చెందిన వంగా గీతను బరిలోకి దింపింది వైసీపీ. పవన్ కల్యాణ్ ప్రచార సభల్లో సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తుండటంతో.. ఇవాళ్టి సభలో సీఎం జగన్ ఎలాంటి కౌంటర్ ఇస్తారా అనే ఆసక్తి ఏర్పడింది. సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్ర, ప్రచార భేరి ఇలా.. విడతలవారీగా ప్రచారాన్ని నిర్వహించారు సీఎం జగన్. దాదాపుగా జనవరి నుంచి ప్రచారంలోనే ఉన్నారు. ఈ రోజు ప్రచారానికి ఫైనల్ టచ్ ఇవ్వనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పిఠాపురంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!