ఎన్నికలకు సమయం మరింత దగ్గర అవుతుంది. ఈ క్రమంలో.. రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తమ నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి చేపడుతామని చెబుతూ ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా.. అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తార్నాక డివిజన్‌లో ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన విభాగం నేతలతో కలసి ఆయన మాణికేశ్వరి నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఉదయగిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉదయగిరి మండలం సంజీవ రాజుపల్లి గ్రామం నుంచి బుధవారం పల్లె పల్లెకు కాకర్ల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది.
కాకినాడ జిల్లా తునిలో భర్త గెలుపుకోసం భార్య లక్ష్మీచైతన్య ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తన భర్త తుని వైసీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. తుని మండలంలోని వల్లూరు, అగ్రహారం, సీతయ్యపేట గ్రామాలలో ఇంటింటికి వెళ్లి లక్షీచైతన్య ఎన్నికల ప్రచారాన్ని చేసారు. ఈ సందర్భంగా లక్ష్మీచైతన్య మాట్లాడుతూ.. మంత్రి దాడిశెట్టి రాజాని ముచ్చటగా మూడోసారి గెలిపించుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ వైసీపీని అధికారంలోకి…
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొత్తపల్లి, తోటమూల గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అందులో భాగంగా.. జనం ప్రభంజనంతో కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతులతో, డాన్సులు వేస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. మీ సమస్యలను తాను పరిష్కరిస్తాను అంటూ ప్రజలకు మాట…
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు సమయం వృధా చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మద్ధతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఓ పక్క ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మరోపక్క తన చిన్న కోడలు స్వాతి గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ముదినేపల్లి మండలం వాడాలి గ్రామంలో స్వాతి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతీ ఇంటికి వెళ్లి…
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ నుంచి బేగంపేట్ వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 50 గడపలు ఉన్న ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా.. మంగళవారం దుత్తలూరు మండలం సోమల రేగడ గ్రామంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాకర్ల సురేష్ గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ…