ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారంలో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని), టీడీపీ సీనియర్ నాయకుడు వంగవీటి రాధ, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంపలగూడెం మండలంలో టీడీపీ నేతలు సుడిగాలి పర్యటన చేశారు. ఇక, చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తూ.. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని), వంగవీటి రాధా, తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Read Also: Adah Sharma : నా వేళ్ళని కుక్క పిల్ల తినేసింది,. ఆదా శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ ప్రచార కార్యక్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వామిదాస్ నువ్వు లోకల్ నేను నాన్ లోకలా అంటూ ప్రశ్నించారు. స్వామిదాస్ నీకు నీ భార్యకు సవాల్ చేస్తున్నా.. నువ్వు 30 సంవత్సరాలలో తిరువూరు నియోజకవర్గంలో ఏం చేసావో.. నేను ఈ 30 రోజులలో తిరువూరు నియోజకవర్గంలో ఏం చేశానో చర్చకు నేను సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. స్వామి దాస్ నీకు దమ్ముంటే రా, టైం నువ్వు చెప్పిన సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పిన సరే, నన్ను చెప్పమన్నా సరే, తిరువూరు నియోజకవర్గంలో ఎక్కడైనా నేను చర్చకి సిద్ధం, నువ్వు సిద్ధమా అంటూ స్వామిదాస్ కు కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Read Also: Amit Shah: నేడు వికారాబాద్ , వనపర్తి ల్లో అమిత్ షా సభలు
కాగా, స్వామిదాస్ నువ్వు నీ భార్య బందిపోట్లు లాగా దోసుకున్నారు అంటూ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. అంగన్వాడీ పోస్టులు అమ్ముకున్నారు.. మున్సిపాలిటీలో స్వీపర్ల దగ్గర డబ్బులు వసూలు చేశారు మీ దంపతులు.. ఇప్పుడు తిరువూరు నియోజకవర్గ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు.. సన్నాసోడు వద్దు సరైనోడు వచ్చాడు అనుకుంటున్నారు.. స్వామిదాస్ ఎప్పుడైనా పల్లెల్లోకి వచ్చాడా.. నేనిప్పుడు తిరుగుతున్నానని స్వామిదాస్ కూడా తిరుగుతున్నాడు అంటూ కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు.