కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని విజయం కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే విషయం తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని నారా బ్రాహ్మణి తాజాగా నెరవేర్చారు.
Wayanad: కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చే నెలలో జరగనున్న వయనాడ్ ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక గాంధీ కోసం అధికారికంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వయనాడ్ లోక్‌సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు (శనివారం) యూడీఎఫ్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించబోతుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది.
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుందని తెలిపారు. తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. శుక్రవారం నుంచి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ్టి ( గురువారం) నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.
ఎన్నికల ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించుకున్నందుకు హర్యానా బీజేపీకి ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. బీజేపీ హర్యానా అనే హ్యాండిల్ ప్రచార వీడియోలో చిన్నారిని ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
కచ్చతీవు ద్వీపం అంశం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. దీని వల్ల శ్రీలంకతో భారత్ సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందని సీనియర్ నేత జైరాం రమేష్ మండిపడ్డారు.
Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నేడు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం