తెలంగాణలో మరోసారి కేసీఆర్ పొరపాటున గెలిచిన ఆర్టీసీ ఆస్తులు మిగలవు అని బండి సంజయ్ ఆరోపించారు. మీ పక్షాన యుద్దం చేస్తున్న నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. మీపక్షాన పోరాడే నాలాంటోళ్లకు అండగా నిలవండి అని కరీంనగర్ ప్రజలను కోరారు.
KTR Road Show: తెలంగాణ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో అధికార బీఆర్‌ఎస్ ఇప్పుడు తదుపరి ప్రచార దశపై దృష్టి సారించింది. ఈసారి గ్రేటర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగనున్నారు.
మంత్రి కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రోడ్ షో వివరాలు ఇవే.. ఉదయం 11 గంటలకు చేవెళ్ల నియోజక వర్గంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సపోర్టుగా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్ టౌన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోసం కేటీఆర్ రోడ్ షో చేస్తున్నారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో చేయనున్నారు.
MLA Laxmareddy: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభివృద్ధి పనులను ప్రజలకు చెబుతూ ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కాగా, ఇవాళ కాంగ్రెస్- బీజేపీ పార్టీలకు చెందిన అగ్ర నాయకత్వం అక్కడ ప్రచారం చేస్తుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు.
నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4,798 మంది, 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న నామినేషన్ల పరిశీలనలో 6 వందలకు పైగా నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ సందర్భంగా ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.