Kotha Manohar Reddy: బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచార షెడ్యూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించనున్నారు. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి సార్లరావు పల్లి, సాయిరెడ్డి గూడ, ముచ్చర్ల, దాసర్లపల్లి తండా, దాసర్లపల్లి, నేద్నుర్, మన్యే గూడ ప్రాంతాలలో పర్యటించనున్నారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇక, మహేశ్వరం నియోజకవర్గంలో ఏనుగు పార్టీ దూసుకుపోతుంది. నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజలు కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించాలని బీఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి కోరారు.
Read Also: Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన ఘట్టం
పదవి లేకపోయినా నిరంతరం పేద ప్రజల మధ్య ఉంటూ కేఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా 3000 మంది నిరుపేదలకు 60 గజాల ఇంటిస్థలం అందజేశానని కొత్త మనోహర్ రెడ్డి వెల్లడించారు. తాను గెలిచిన వెంటనే మహేశ్వరం నియోజక వర్గంలోని నిరుపేదలను గుర్తించి వారికి కూడా 60 గజాల ఇంటి స్థలాన్ని అందజేస్తానని ఆయన పేర్కొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జా చేసిన భూములన్నీ తిరిగి పేద ప్రజలకు పంచి పెడతానని హామీ ఇచ్చారు. ఎప్పుడు మీతోనే ఉండి.. ఆపద వచ్చినప్పుడు కూత వేటు దూరంలో ఉండే నాయకుడు కావాలా.. లేక ఎలక్షన్ లు రాగానే అధికార దాహంతో విచ్చల విడిగా డబ్బులు, మందు, పంచి మళ్లీ ఎన్నికల తర్వాత కనిపించకుండ పోయే నాన్ లోకల్ లీడర్లు కావాలా మీరే తేల్చుకోవాల అని కొత్త మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!