వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే…
కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ మోతినగర్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్తి బండి రమేష్, ఆయన సతీమణి లకుమాదేవితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. భర్త గెలుపే లక్ష్యంగా సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు అందేలా పక్కా ప్రణాళికతో లకుమాదేవి ఇంటింటా ప్రచారం చేశారు.
అంబర్పేట అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని మహంకాళి టెంపుల్ అయినా, ఎక్కడైనా సరే చర్చిద్దాం అని చెప్పారు. ప్రచారంలో భాగంగా.. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని చెన్నారెడ్డి నగర్, ప్రేమ్ నగర్, న్యూ పటేల్ నగర్లలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు కాలేరు పద్మావతి, కార్పొరేటర్ లావణ్య గోల్నాకలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కారు…
ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో అలంపూర్ కు వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రేవంత్ రెడ్డి 4 నియోజకవర్గాల్లో పర్యటించబోతున్నారు. ఈరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, నారాయణఖేడ్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి కోరారు. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మాట తప్పారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈనెల 25న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వికారాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు 2జీ, 3జీ, 4జీలు.. బీజేపీ 2జీ, 3జీ, 4జీ కాదు తెలంగాణ ప్రజల పార్టీ అని అమిత్ షా అన్నారు. మోడీ కృషితోనే చంద్రాయన్ విజయవంతం అయింది.. ఇప్పటి వరకు ఏ పార్టీ చేయని విధానంగా బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందన్నారు.