జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. దోనుర్, సింగందొడ్డి, లాఖ్య తండా, మంగళిగడ్డ తండా, మోత్కూలకుంటా తండా మీదుగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం కొనసాగుతుంది.
CM KCR: రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా నేటి నుంచి సీఎం కేసీఆర్ రెండో విడత జన ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఅర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది.
అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్.. బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాభ్ నగర్, ఎరుకల బస్తీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా.. డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, మహిళా నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ ప్రచారంలో బస్తీ వాసులు కాలేరు వెంకటేష్ కు గులాబీ పూలతో పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ కూడలిలో ఒక్కసారిగా గణేష్ మండపం కుప్పకూలింది. దీంతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 10 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని గ్రామంలోనే ప్రథమ చికిత్స అందించారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విజయవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోదాడకు బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు.. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఉన్నారు. డీకే శివకుమార్ కోదాడ, హుజుర్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. మూడు అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేస్తానని తెలిపారు. తెలంగాణ మొత్తం మార్పుకోసం చూస్తోందని.. సోనియాకు కృతజ్ఞత…
Telangana Assembly Election: తెలంగాణలో ఎన్నికల వేళ హెలికాప్టర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఎన్నికల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలంతా ప్రైవేట్ హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. ఆయన రేపు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొనాయపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఖమ్మం జిల్లాలో ఈనెల 4న ( శనివారం ) ముదిగొండ మండలం యడవల్లి నుంచి మధిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు.