ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కాగా, ఇవాళ కాంగ్రెస్- బీజేపీ పార్టీలకు చెందిన అగ్ర నాయకత్వం అక్కడ ప్రచారం చేస్తుంది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. అయితే, నవంబర్ 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఆ తర్వాత ప్రచారం చేసేందుకు అవకాశం ఉండకపోవడంతో చివరి రోజు రెండు పార్టీల అగ్రనాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
Read Also: Prabhas: ఆ కటౌట్ కి ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు…
ఇక, నవంబర్ 17న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ప్రచార సందడి ఆగిపోతుంది. కాగా, అమిత్ షా మధ్యాహ్నం 12:00 గంటలకు ఛత్తీస్‌గఢ్‌లోని సజా నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. దీని తర్వాత, మధ్యాహ్నం 01:55 గంటలకు జంజ్‌గిర్-చంపా నియోజక వర్గం.. ఆ తర్వాత మధ్యాహ్నం 03:20 గంటలకు కోర్బాలో బీజేపీ నిర్వహించే ఎన్నికల సభలో ప్రసంగించనున్నారు. ఇక, సాయంత్రం బిలాస్‌పూర్‌లోని గాంధీచౌక్ నుంచి అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈరోజు రెండు ఎన్నికల సభల్లో పాల్గొంటారు. మొదటి ఈవెంట్ హైస్కూల్ గ్రౌండ్ ఆరాంగ్‌లో మధ్యాహ్నం 01:25 గంటలకు జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 03:10 గంటలకు అంబికాపూర్‌లోని కళాకేంద్ర గ్రౌండ్‌లో జరుగనుంది. దీనికి ముందు ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ అభ్యర్థుల కోసం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ సైతం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
Read Also: Stock Market Opening: రాకెట్ వేగంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 500 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
మరో వైపు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాయ్‌గఢ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్ నాయక్, చరదాస్ మహంత కోసం వేర్వేరు సమావేశాల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు బెమెతరలోని బీటీఐ గ్రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ ఛబ్రా, టీఎస్ సింగ్‌దేవ్, డాక్టర్ ప్రీతమ్ రామ్, దీపక్ బైజ్ లకు మద్దతుగా జరిగే ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రచారం చేస్తున్నారు.