Election Campaign: యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు విజయం..
- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హర్యానా.. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం
- ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం
- సీఎం యోగికి దేశ వ్యాప్తంగా ప్రజాదరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. కాగా.. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అధిష్టానం యోగి ఆదిత్యానాథ్‌ను దేశం నలుమూలలకు పంపుతోంది. ఈ క్రమంలో.. జమ్మూలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో సీఎం యోగి సమావేశాలు నిర్వహించారు. ఆ నాలుగు స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. యోగి ఆదిత్యనాథ్ హర్యానాలో 14 సభలు నిర్వహించగా అందులో 9 స్థానాలపై బీజేపీ విజయపతాకం ఎగురవేసింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 9 స్థానాల్లో గెలుపొందడం చాలా ముఖ్యం. మిగిలిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. హర్యానాలో నాలుగు రోజులు, జమ్మూలో రెండు రోజులు యోగి సమావేశాలు నిర్వహించారు.
Tamilnadu: ఘోర ప్రమాదం.. బాణాసంచా పేలి ముగ్గురు మృతి
Also Read
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన స్థానాలు:
సెప్టెంబరు 22న నర్వానా, రాయ్, అసంధ్ లో ప్రచారం నిర్వహించారు. సెప్టెంబరు 28న ఫరీదాబాద్, రాదౌర్, జగద్రి, అటెలిలో ప్రచారం చేశారు. 30 సెప్టెంబరు బవానీ ఖేడా, హన్సి, నార్నౌండ్, పంచకులలో ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 3 షహాబాద్, కలయత్, సఫిడాన్ లో ప్రచారం నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ ప్రచార స్థానాలు ఇవే:
సెప్టెంబరు 26 రామ్‌గఢ్, ఆర్ఎస్ పురా సౌత్ లో ప్రచారం చేశారు. సెప్టెంబరు 27 రాంనగర్, కథువాలో ప్రచారం నిర్వహించారు.
తాజావార్తలు
-
Nobel Prize 2026: కెనడా రచయిత్రి అన్నే కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్ పురస్కారం
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!