ప్రచారానికి రేపు ఒక్కరోజు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రచారంలో జోరు పెంచుతున్నారు. అందులో భాగంగా.. ఖమ్మం జిల్లా ముష్టికుంట్లలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు తెలంగాణ పేదలకు కేసీఆర్ చేసిందేమీ లేదని ఆరోపించారు. ఏం చేయలేని కేసీఆర్ ఎక్కడుంటే ఏం లాభమని ప్రశ్నించారు?.
Harish Rao: రైతుబంధు ఆగిపోవడంపై మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం రైతుబంధుకు అనుమతి నిరాకరించిందని అన్నారు.
BJP Meetings: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు కేంద్రంలోని అధికార బీజేపీ కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 10.25 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరి 11 గంటలకు హకీంపేట్‌కు ఆయన చేరుకోనున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ నేడు భువనగిరి, గద్వాల్, కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అక్కడ నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధులకు మద్దతుగా ఆమె ప్రచారం చేయబోతున్నారు.
ఎన్నికలకు మరో మూడు రోజులు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం దూకుడు పెంచారు. ఏకంగా హైకమాండ్ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ.. అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కవరయ్యేలా పర్యటన షెడ్యూల్ ను రూపొందించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్ధతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా తెలిపేందుకు విచ్చేసిన యోగి ఆదిత్యానాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. కుత్బుల్లాపూర్ గడ్డమీద అడుగుపెట్టినందుకు వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మంత్రి కేటీఆర్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2009లో గెలిస్తే తెలంగాణ తెస్తా అని మీకు హామీ ఇచ్చినా.. కేసీఆర్ ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది, అందులో అందరి కష్టం ఉందని అన్నారు. సిరిసిల్లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా.. అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని…