ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధం అవుతున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అది కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారట.. ఈ నెల 25వ తేదీన భీమిలిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు వైసీపీ రెడీ అవుతోంది.
సింగరేణిలో ఎన్నికల ప్రచారం మరి కాసేపట్లో ముగియనుంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి జరగనున్న ఎన్నికల్లో 13 పార్టీలు పోటీ పడుతున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, సీపీఐ, టీఆర్ఎస్ పార్టీల పోటీ కొనసాగుతుంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ముఖ్యమంత్రి చేసి నా గౌరవాన్ని పెంచింది గజ్వేల్ గడ్డ అని తెలిపారు. గజ్వేల్ కి రైలు వస్తుందని అనుకోలేదు కానీ రైలు వచ్చింది.. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు గజ్వేల్ కి వచ్చి మన అభివృద్దిని చూసి వెళ్తున్నారని తెలిపారు. అయ్యింది చాలా గొప్ప అంటే సరిపోదు..ఇంకా చాలా చేయాలన్నారు.…
వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ఈ వరంగల్ జిల్లా అని అన్నారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎలక్షన్స్ వస్తే పార్టీకి ఒక్కరు వస్తారని విమర్శించారు. తప్పకుండ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. ఎలక్షన్స్ ఐపోగానే దుకాణం మొదలవుతుంది.. పార్టీల చరిత్రల ఆధారంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు నేడు పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
CM KCR: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం మంగళవారంతో ముగియనుంది. ఓటింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
తన సొంత ఇలాకాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. సోమవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది అని అన్నారు. 20 ఏండ్లు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాడానని తెలిపారు. ఈ కొడంగల్ గడ్డ... నా అడ్డా.. మీ బిడ్డ.. మీరు నాటిన మొక్క... రాష్ట్రానికి నాయకత్వం…
తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ కార్యకర్తలు, జనాలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్ షో జరుగుతున్నంత సేపు.. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. 45 నిమిషాలు పాటు ఈ రోడ్ షో సాగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి కాచిగూడ చౌరస్తా వరకు 2.5…
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో వంద శాతం గెలుస్తామన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.