కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్ధతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా తెలిపేందుకు విచ్చేసిన యోగి ఆదిత్యానాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా.. కుత్బుల్లాపూర్ గడ్డమీద అడుగుపెట్టినందుకు వారికి శిరస్సు వంచి స్వాగతం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. హిందూ ధర్మ రక్షకుడు.. యోగి ఆదిత్యానాథ్ ఈ కుత్బుల్లాపూర్ గడ్డమీద అడుగుపెట్టగానే ఈ నేల పులకరించిందని తెలిపారు.
NIA: పాక్ లింక్డ్ “గజ్వా-ఏ-హింద్” టార్గెట్‌గా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..
ఇక్కడున్న బీఆర్ఎస్ అభ్యర్థి.. కేటీఆర్, కేసీఆర్ అండ చూసుకొని ప్రధాని మోదీ మీద విమర్శలు చేస్తున్నారని శ్రీశైలం గౌడ్ తెలిపారు. ఈ బీఆర్ఎస్ అభ్యర్థికి మోదీ మీద మాట్లాడే స్థాయి ఉందా అని మండిపడ్డారు. ఇవాళ కుత్బుల్లాపూర్ కు హిందూ సింహం.. యోగి ఆదిత్యానాథ్ వస్తే… గుంట నక్క లెక్క దాక్కున్నావ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక్కటే సవాల్ విసురుతున్నా.. నీ కేటీఆర్, కేసీఆర్ అండ చూసుకొని.. బాగా ఎగురుతున్నావ్.. నరేంద్ర అని మోడీ మాట్లాడుతున్నావ్.. నీకు నిజంగానే కేసీఆర్, కేటీఆర్ అండదండలు ఉంటే.. కుత్బుల్లాపూర్ కు ప్రత్యేకంగా ఎన్ని నిధులు తెచ్చినవో చెప్పు..ఏం ప్రత్యేకంగా తెచ్చినవో చెప్పు అని అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు దమ్ముంటే చిత్తారమ్మ గుడికి దగ్గరికి రా.. నేను వస్తానని తెలిపారు. తొమ్మిదేండ్లు నువ్వేం చేసినవో చర్చకు సిద్దామా? అని సవాల్ విసురుతున్నానన్నారు.
PM Modi: రేపు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
మొన్న ఎన్టీవీ డిబేట్ లో నా గొంతు పిసికి దాడి చేసినవ్ కదా.. నీకు దమ్ముంటే, రేపు చిత్తారమ్మ గుడికి రా అని సవాల్ చేశారు. బీజేపీ ఓట్లు చీల్చేందుకు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, కేసీఆర్ కు వేసినట్టేనని అన్నారు. బీజేపీకి ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్టని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే హిందూ ధర్మానికి ఓటేసినట్టు.. బీజేపీకి ఓటు వేస్తే నీ దేశ రక్షణకు ఓటేసినట్టు.. బీజేపీకి ఓటేస్తే నీకు ఓటేసినట్టనని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే అమెరికా వెళ్లి ఎంజాయ్ చేస్తాడు.. కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ఫామ్ హౌస్ కి పోతాడని వ్యాఖ్యానించారు. కానీ నేను పదవులు ఉన్నా లేకున్నా మీకు అండగా ఉన్నానని తెలిపారు.