ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు
దేశానికి సంబంధించిన ఎన్నికలు వచ్చేనెల జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవి దేశానికి ఎవరు ప్రధాని కావాలి, ఎవరు పరిపాలించాలి అని నిర్ణయించే ఎన్నికలని ఆయన వెల్లడించారు.
గత కొద్దిరోజుల నుంచి దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఆయా రాష్ట్రలలో ఉన్న రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ కీలక విషయాన్ని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏ తేదీన విడుదల చేస్తామన్న విషయాన్ని…
గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు కోసం తల్లి కాకర్ల మస్తానమ్మ, అత్త కడియాల పద్మావతి, మామ కడియాల వెంకటేశ్వర్లు కలిగిరి మండలం లక్ష్మీపురం పంచాయతీ కండ్రిక గ్రామంలో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ ఎన్నికలు తెలంగాణకో.. సికింద్రాబాద్ కో సంబంధించినవి కావు.. దేశం కోసం జరిగే ఎన్నికలు ఇవి అని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ పైన గల్లీ టూ గల్లీ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.