నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన సీతారాంపురం పరిధిలోని చిన్నగంపల్లి నుంచి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజలు నాకు ఓటేస్తారని భరోసా ఇస్తున్నారు తెలిపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్ట లేదు అని చెప్పుకొచ్చింది.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్‌లోని కోట్‌పుట్లీలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
పరిశ్రమలు రావాలంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. కలిగిరి మండల కేంద్రంలో కాకర్ల సురేష్, మండల కన్వీనర్ బిజ్జం వెంకట కృష్ణారెడ్డి, వరికుంటపాడు మండలానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు, ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన సుంకర అంజనాద్రి, వెంకటాద్రిల ఆధ్వర్యంలో కలిగిరి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు.. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తమ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఈ క్రమంలో.. టీడీపీ గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం నిర్వహించారు. విజయవాడ రూరల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇంటింటికి ప్రచారం చేపడితే కేసులు తప్పవని తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ అంశం సంబంధించి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడంతో రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ కు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. Also read: Game Changer : జరగండి జరగండి.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ వచ్చేనండి.. తాజాగా…
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధ్వర్యంలో సోమవారం నాడు సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గ నలువైపుల నుంచి మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు చేయబోతున్నారు.