Kishan Reddy: మూడో సారి మళ్లీ మోడీనే ప్రధాని కాబోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: ఈ ఎన్నికలు తెలంగాణకో.. సికింద్రాబాద్ కో సంబంధించినవి కావు.. దేశం కోసం జరిగే ఎన్నికలు ఇవి అని సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్ పైన గల్లీ టూ గల్లీ కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో ప్రచారం నిర్వహించనున్నారు. కరోనా వచ్చినప్పుడు మన ప్రాణాలు కాపాడిన మహానుభావుడు మోడీ అని.. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. కరోనా సమయంలో నుంచి ఈరోజు వరకు ఉచిత బియ్యం ఇచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
డిపాజిట్స్ లేకుండా పొదుపు సంఘాలకు 20లక్షల రుణాలు ఇచ్చాం.. మళ్లీ ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ముస్లిం బిడ్డలకు మోడీ అండగా నిలిచి.. ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని.. ముస్లిం ఆడబిడ్డల మీద కత్తిలాగా ట్రిపుల్ తలాక్ ఉండేదన్నారు. మళ్లీ ముస్లిం మహిళలను ప్రమాదంలోకి నెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన ఆరోపించారు. 500 ఏళ్ల నుంచి రామ జన్మభూమి నిర్మాణం హిందువుల కల ఉండేదని.. మోడీ హయాంలోనే రామ మందిర నిర్మాణం సాకారం అయ్యిందన్నారు. ఎయిర్‌పోర్టులు, వ్యవసాయ రంగం, రైల్వే ఇలా ప్రతి రంగం అభివృద్ధి చెందిందన్నారు కిషన్ రెడ్డి.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి మోడీ లోన్స్ ఇస్తున్నారని.. దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి.. ప్రపంచంలో దేశ గౌరవాన్ని పెంచారని చెప్పారు. మూడో సారి మళ్లీ మోడీనే ప్రధాని కాబోతున్నారని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..