దేశ ప్రజలకు ఒక్కటే గ్యారంటీ.. అది మోడీ గ్యారంటీ తప్ప వేరే ఏ గ్యారంటీ లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీంగల్‌లోని బ్రహ్మ లింగేశ్వర టీ పాయింట్ దగ్గర చాయ్ పే చర్చలో ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు. అయోధ్యలో రాముల విగ్రహం తర్వాత మొదటి శ్రీరామ నవమి కాబట్టి బుధవారం ఘనంగా జరుపుకోవాలన్నారు. భీంగల్‌లో మంచినీటి సమస్య ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. వెనకబడిన భీంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బస్ డిపోను తెరిచి మళ్ళీ ఎన్నికలు కాగానే దాని మూసివేశారని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు అని ఎన్నికలు అయ్యాక ఏ గ్యారంటీ లేదని విమర్శించారు. ఇదంతా నిజామాబాద్ జిల్లా ప్రజలు గమనించాలని అరివింద్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Supreme Court: మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారు..? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు
తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించేసింది. దీంతో అభ్యర్థులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరోసారి అగ్రనేతలంతా తెలంగాణకు రానున్నారు. ఈసారి తెలంగాణలో 10 సీట్లు లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో బీజేపీ గెలుచుకుంది. ఇక తెలంగాణలో నాల్గో విడతలో మే 13న పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Election Commission: భద్రాద్రి సీతారాముల కళ్యాణం లైవ్ టెలికాస్ట్కు ఈసీ గ్రీన్ సిగ్నల్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Off The Record: ఆ ఎమ్మెల్యేను ఆటలో అరటిపండు అనుకుంటున్నారా..?