IMD : భారత వాతావరణ శాఖ (IMD) తాజా ప్రకటన ప్రకారం, దేశాన్ని ప్రభావితం చేసిన ఎల్ నినో పరిస్థితులు తొలిగిపోయాయి. దీని ప్రభావంతో గత ఏడాది పాటు ప్రతీ సీజన్ ఆలస్యంగా మొదలైందీ కాక, సాధారణ దినాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ వాతావరణ తారతమ్యం తగ్గిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఈశాన్య భాగంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా పెరిగే ఒక ప్రకృతి…
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలంటే వర్షాలే ఆధారం. సమయానికి వర్షాలు కురిస్తేనే అన్నదాత కళ్లల్లో ఆనందం నిండుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ అందించింది. మాన్‌సూన్ అప్‌డేట్ అందించింది. ఈ సంవత్సరం జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. IMD అంచనా ప్రకారం.. ఈసారి రుతుపవనాలు సగటు కంటే 105 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు చేస్తాయని అంచనా వేసింది. లడఖ్, ఈశాన్య, తమిళనాడులలో…
Temperature Rise: భారతీయ నగరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఢిల్లీ నగరంలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది
Summer Heatwave: ఈ ఏడాది వేసవి మరింత హాట్‌గా ఉండబోతున్నట్లు భారత వాతావరణ సంస్థ(ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
El Nino: ఎల్ నినో వాతావరణ పరిస్థితి ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో వెచ్చటి సముద్ర ఉష్ణోగ్రత ఆధారంగా ఎల్ నినో తీవ్రతను వర్గీకరిస్తారు. తాజాగా ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, 2024 మధ్య వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితి లాటిన్ అమెరికా అంతటా అసాధారణ వర్షపాతానికి దారి తీస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ, మత్స్య పరిశ్రమ తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
Monsoon: అనుకున్నట్లుగానే ఎల్ నినో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రుతుపవన వర్షపాతం 2023లో ఐదేళ్ల కనిష్టానికి చేరుకుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ వర్షపాత నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. 3 ట్రిలియన్ డాలర్ల ఉన్న ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు చాలా కీలకం. పంటలకు నీరందించడానికి, జలశయాలను నింపడానికి అవసరమైన 70 శాతం వర్షాన్ని రుతుపవనాలే అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కవు నీటి సరఫరా వ్యవస్థ…
Rice Exports Ban: భారతదేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్థానికంగా రైస్ ధరలు పెరగడంతో ఈ చర్య తీసుకోవాలని అనుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉన్న భారత దేశం ఎగుమతులపై నిషేధించాలని భావిస్తోంది. ‘ఎల్ నినో’ పరిస్థితి వాతావరణం, వర్షాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బియ్యం ధరలు పెరగకుండా, లభ్యత పెంచే విధంగా ఉండాలంటే నిషేధం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు.
El Nino:వాతావరణ నిపుణులు అంచనా వేసినట్లుగానే పసిఫిక్ మహాసముద్రంలో ‘ఎల్ నినో’ ఏర్పడింది. ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల అనేక దేశాల్లో ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
El Nino: ప్రపంచం ఇప్పుడిప్పుడే కోవిడ్ బారి నుంచి కోలుకుంటోంది. పాండమిక్ దశ నుంచి ఎండమిక్ దశకు చేరుకుంది. దీంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే రానున్న రోజుల్లో మరింతగా వైరస్‌లు విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అయితే దీనికి కారణం ఎల్ నినో అనే వాతావరణ పరిస్థితి అని తెలిపింది. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఎల్ నినో తిరిగి రావడంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణం, ఆర్థిక క్షీణత, వ్యవసాయం…
Monsoon: ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశం 90 శాతం ఉందని తెలిపింది. గతంలో ఎల్ నీనో ఏర్పడిన పలు సందర్భాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదు…