Southwest Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఈ రోజు వెల్లడించింది. జూన్ 4 నాటికి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాయని తెలిపింది. సాధారణంగా ఏడు రోజులకు అటుఇటుగా జూన్ 1 న కేరళలోకి ప్రవేశిస్తాయి.
IMD hopeful of normal monsoon in 2023: ఈ ఏడాది రుతుపవనాల గురించి కీలక విషయం చెప్పింది భారత వాతావరణ శాఖ(ఐఎండీ). 2023లో దేశంలో సాధారణ రుతుపవనాలు ఉంటాయని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది భారత్ లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని ఆశిస్తోంది. అయితే భారతదేశంలో రుతుపవన సీజన్ లో ఎల్-నినో ఏర్పడే అవకాశం ఉందని, ఇది వర్షాలను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది.