భారతదేశం వ్యవసాయాధారిత దేశం. ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. పంటలు సమృద్ధిగా పండాలంటే వర్షాలే ఆధారం. సమయానికి వర్షాలు కురిస్తేనే అన్నదాత కళ్లల్లో ఆనందం నిండుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతన్నలకు గుడ్ న్యూస్ అందించింది. మాన్‌సూన్ అప్‌డేట్ అందించింది. ఈ సంవత్సరం జోరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. IMD అంచనా ప్రకారం.. ఈసారి రుతుపవనాలు సగటు కంటే 105 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు చేస్తాయని అంచనా వేసింది. లడఖ్, ఈశాన్య, తమిళనాడులలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది.
Also Read:Vishwambhara: ‘రామ..రామ’ కోట్లు.. ఆ మాత్రం ఉండాల్సిందేలే!
ఎల్ నినో, హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులు సాధారణంగా ఉంటాయని, దీని ఫలితంగా మంచి వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఈ రెండింటి అనుకూల పరిస్థితుల కారణంగా, దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవనున్నట్లు తెలిపారు.యురేషియా, హిమాలయ ప్రాంతంలో మంచు పరిమాణం తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హిమాలయాలు, దాని పరిసర ప్రాంతాలలో మంచు తక్కువగా ఉన్నప్పుడు, భారతదేశంలో రుతుపవన వర్షపాతం సగటు కంటే ఎక్కువగా ఉంటుంది.
Also Read:CM Revanth Reddy : ఎంపీ చామలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. మంత్రి వర్గంపై మాట్లాడొద్దు
2025 సంవత్సరంలో వర్షాకాలంలో (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రుతుపవనాల సమయంలో సగటు వర్షపాతం దీర్ఘకాలిక సగటు 87 సెం.మీ.లో 105 శాతం ఉంటుందని అంచనా. మంచి వర్షాలు కురుస్తుండటం వల్ల, రైతులు, నీటి సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ఉపశమనం లభించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేడిగాలులు కొనసాగుతాయని మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. సాధారణంగా రుతుపవనాలు జూలై 1న కేరళ నుంచి భారతదేశంలోకి ప్రవేశించి క్రమంగా ఉత్తరం, తూర్పు, పడమర వైపు విస్తరిస్తాయి. జూలై మధ్య నాటికి రుతుపవనాలు దేశవ్యాప్తంగా వ్యాపిస్తాయి.