Shiv Sena MLA: ముంబైలో హాస్టల్ క్యాంటీన్‌లో నాసిరకం భోజనం పెట్టారని శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటిన్ సిబ్బందిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇవాళ (గురువారం) దక్షిణ భారతీయులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లు నడుపుతూ మహారాష్ట్ర సంస్కృతిని పాడు చేస్తారు. వారు మన పిల్లలను భ్రష్టుపట్టించారని ఆరోపించారు. అలాగే, సౌత్ ఇండియాకు చెందిన వ్యక్తులకు మహారాష్ట్రలో ఆహార సరఫరా కాంట్రాక్టులు ఇవ్వకూడదని ఆయన పేర్కొన్నారు. శెట్టి అనే కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? దాన్ని మరాఠీ వ్యక్తికి ఇవ్వండి అని సూచించారు. ఇక, మనం ఏం తింటామో దక్షణాది వారికి ఏం తెలుసు.. మరాఠకు చెందిన వాళ్లు అయితే.. మాకు మంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు అని శివసేన (షిండే) సంజయ్ గైక్వాడ్ వెల్లడించారు.
Read Also: Anushka : నా ఫస్ట్ లవ్ అతడితోనే.. ఇప్పటికీ మధుర జ్ఞాపకంగా మిగిలింది !
అయితే, బుల్ధానా నుంచి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన సంజయ్ గైక్వాడ్.. ముంబైలోని గెస్ట్ హౌస్‌లో నాసిరకం ఆహారం వడ్డించారనే ఆరోపణలతో క్యాంటీన్ కాంట్రాక్టర్‌ను కొట్టాడు. ఈ సంఘటన తర్వాత కాంట్రాక్టర్‌కు “అప్నే స్టైల్ సే (నా స్టైల్‌లో)” అనే గుణపాఠం నేర్పించానని అతడు గొప్పగా చెప్పుకున్నాడు. క్షమాపణ చెప్పకుండా, గైక్వాడ్ తన చర్యలను సమర్థించుకోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇక, సంజయ్ గైక్వాడ్ దాడిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ఇటువంటి ప్రవర్తనతో శాసనసభ్యులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే తప్పుడు సందేశం ప్రజల్లోకి వెళ్తుందన్నారు.