Manda Krishna Madiga: విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ఏపీ, తెలంగాణ సీఎంలను కలుస్తామని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ను అమలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ ఉన్న రాష్ట్రాలన్ని అమలు చేసేలా ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేశానని తెలిపారు. నవంబర్ 11 న హైదారాబాద్ లో జరిగిన విశ్వరూప సభకు హాజరయిన మోడీ.. మా ఉద్యమానికి మద్దతు పలికారన్నారు. సుప్రీం కోర్టులో సైతం కేంద్రం తమ వాదనను వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈ జడ్జిమెంట్ రావడానికి కేంద్ర రాష్ట్రాల సహకారం ఉందన్నారు. మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి లకు ధన్యావాదాలు తెలిపానని తెలిపారు.
Read also: Funny Thief in Siddipet: అంబులెన్స్ దొంగలించిన దొంగ.. అరగంటలో యాక్సిడెంట్ ఆసుపత్రికి
వర్గీకరణ డిమాండ్, రాష్ట్రాలు వెంటనే ముందుకు రాకపోతే, సుప్రీం కోర్టును రాష్ట్రాలు ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలను కేంద్రం ఆదేశించాలని ప్రధానిని కోరానని అన్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో సమావేశాలు నిర్వహించాలని ప్రధాన మంత్రిని కోరానని తెలిపారు. ఈ నెల 13 న హైదారాబాద్ కు బయలుదేరుతానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తామన్నారు. విద్యా, ఉద్యోగాల్లో వెంటనే రిజర్వేషన్లు అమలు చెయ్యాలని కోరుతామన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాం అని.. రేవంత్ రెడ్డి శాసన సభలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పారన్నారు. తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులను కలుస్తామని అన్నారు. నార్త్ లో కూడా పలు రాష్ట్రాల్లో వర్గీకరణ కోసం డిమాండ్లను ఉన్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులను కలుస్తామన్నారు.
Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..