రాష్ట్రంలో అటవీ భూములపై హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కి ఆదివాసీల ప్రతినిధులు కోరారు. ప్రగతి భవన్ లో మంత్రి కే. తారక రామారావు ని కలిసిన ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు.తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో… ఎక్కువ ప్రాంతాల్లో…
కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. కోవిడ్ విజృంభిస్తే చాలు.. మొదట మూసివేసేది స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలే అనే విధంగా తయారైంది పరిస్థితి.. దీంతో.. విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. అయితే, ఓవైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్నా.. ఇప్పటికే మూతపడిన స్కూళ్లను మళ్లీ తెరిచేందుకు సిద్ధం అవుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.. కానీ, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని..…
కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన చేశారు. విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు. అయితే, ఈ కారణంగా పాఠశాలలను మూసివేయడాన్ని ప్రపంచబ్యాంకు సమర్థించుకోలేమంటోంది. విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం…
చదువులంటే వారికిష్టం లేదు. అస్తమానూ స్కూల్‌కి వెళ్ళడం, హోంవర్కులు రాయడం వారి బుర్రకు పట్టలేదు. అందుకే ఆ మార్గం ఎంచుకున్నారు. చదవడం ఇష్టం లేక నలుగురు విద్యార్థులు అదృశ్యం అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో జరిగింది. పటాన్ చెరు గౌతంనగర్ కాలనీకి చెందిన నలుగురు స్నేహితులు ఈ పని చేశారు. రాహుల్, ఎనిమిదవ తరగతి, విక్రమ్ నాలుగో తరగతి, ప్రీతమ్ నాలుగో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయ్యారు. పిల్లలు కనిపించకపోవడంతో…
ఈత సరదా కుటుంబాల్లో విషాదం నింపుతోంది. గుంటూరు జిల్లా మాదిపాడులో వేద విద్యార్థుల విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో…
ఏ మనిషి జీవితంలో ఎదగాలి అన్నా విద్య అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యను అభ్యసించిన మనిషి పెద్దయ్యాక ఉన్నతంగా ఎదుగుతారు అనడంలో సందేహం అవసరం లేదు. ఇక పాఠశాల విద్యావిధానం మనదేశంలో ఎలా ఉన్నదో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనాకు ముందు దేశంలో కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చారు. వివిధ దేశాల్లో వివిధ రాకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింగపూర్: సింగపూర్ లో మూడు రకాల విద్యావిధానాలు అమలులో ఉన్నాయి. ఆరేళ్లు ప్రైమరి,…
కరోనా తరువాత దేశం ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం అయ్యాయి. పేదవాళ్ల పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది. తినేందుకు తిండి దొరక్క చిన్నారులు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకుంటున్నా వారి పరిస్థితులు మారడంలేదు. ఇక చాలా మంది అలాంటి వారికి కొంత డబ్బులు ఇచ్చి ఫొటోలు దిగుతుంటారు. దీనిని గమనించిన సునీల్ జోషి అనే ప్రైవేటు టీచర్ 50 మంది చిన్నారులను దత్తత తీసుకున్నారు. వారికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.…
కోర్సులను ప్రవేశపెట్టేందుకు సమాయత్తం అవుతోంది.. గతంలో ఇలాంటి ప్రయత్నం చేసినా.. కొన్ని విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేసేందుకు పూనుకుంది.. దీంతో.. మూడేళ్ల డిగ్రీకి బదులు కొత్త డిగ్రీ కోర్సులు అమల్లోకి రానున్నాయి.. అయితే, పీజీ ఒకే సంవత్సరంలో పూర్తి చేయొచ్చు.. ఎందుకంటే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు.. రెండేళ్లకు బదులు ఏడాది కాలపరిమితితో పోస్టు గ్రాడ్యుయేషన్…
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్న ఆమె.. రేపు రిలీవ్ కానున్నారు.. ఏడాది పాటు ఆమె అక్కడే చదువుకోనున్నారు.. గత ఏడాది ఫిబ్రవరి 3న హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తొమ్మిది నెలలుగా మేడ్చల్ జిల్లాకు ఇన్చార్జి కలెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు.. దీంతో.. హైదరాబాద్‌తో పాటు, మేడ్చల్ జిల్లాకు కూడా కొత్త…