తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్.. విద్యాశాఖ మంత్రి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ ఎంట్రీతో దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభంమైంది.. ఇదే సమయంలో తెలంగాణలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో.. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న తరుణంలో సెలవులను జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, ఈ నెలతో సెలవులు ముగిసిపోనున్నాయి.. మరోవైపు.. ఆన్‌లైన్‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. తిరిగి ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది.. దీంతో.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.. రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.. అయితే, విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసిన ఆమె.. స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.
Read Also: స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె వాయిదా
Also Read
మరోవైపు.. కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా.. ఈ నెల 30 తర్వాత విద్యాసంస్థలను తిరిగి తెరుస్తారా? అంటూ హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.. దీనికి బదులిచ్చిన ప్రభుత్వం.. ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ స్కూళ్లు తెరుస్తామని చెప్పడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ.. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది.. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల రీఓపెన్‌కే మొగ్గు చూపింది ప్రభుత్వం.. ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి.. ప్రైవేట్ విద్యాసంస్థలు అయితే.. కేజీ టు పీజీ ఆన్‌లైన్ విద్యనే భోదిస్తున్నాయి.. కానీ, వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదని, విద్యాసంస్థలు తిరిగి తెరవాలనే డిమాండ్ క్రమంగా పెరగడంతో.. విద్యాసంస్థల తెరిచేందుకు మొగ్గుచూపింది సర్కార్.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!