మళ్లీ తెరుచుకోన్న స్కూళ్లు.. విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. కోవిడ్ విజృంభిస్తే చాలు.. మొదట మూసివేసేది స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలే అనే విధంగా తయారైంది పరిస్థితి.. దీంతో.. విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. అయితే, ఓవైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్నా.. ఇప్పటికే మూతపడిన స్కూళ్లను మళ్లీ తెరిచేందుకు సిద్ధం అవుతోంది మహారాష్ట్ర ప్రభుత్వం.. వచ్చే వారం నుంచే అన్నిస్కూళ్లు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ తెలిపారు.. కానీ, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని.. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లు తిరిగి ప్రారంభవుతాయని వెల్లడించారు.. అంతేకాదు.. సీఎం ఉద్ధవ్ థాకరే కూడా తమ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు మంత్రి గైక్వాడ్.
కాగా, ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు, మరోవైపు డెల్టా కేసులు పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తూ కల్లోలమే సృష్టిస్తున్నాయి.. దీంతో.. ఫిబ్రవరి 15వ తేదీ వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టు మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది.. కానీ, కొన్ని వర్గాల నుంచి స్కూళ్లను ఓపెన్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోందని చెబుతున్నారు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్.. దీనిపై నిపుణులతో చర్చించి ఆ తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని.. మొదటగా కోవిడ్ కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. మరోవైపు.. కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో.. తెలంగాణలో ఈ నెల 30వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!