నాణ్యమైన విద్య దిశగా ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ మరో ముందడుగు వేసింది.. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధంచేసేందుకు రాష్ట్ర విద్యారంగంలో మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది.. అందులో భాగంగా అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందంపై ఏపీ ప్రభుత్వం, బైజూస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయం వేదికగా విద్యాశాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం…
ఏపీలో వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అగ్రి పాలీసెట్-2022 నోటిఫికేషన్‌ను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య వర్సిటీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!! అగ్రి పాలీసెట్ పరీక్ష…
మనం చూసిన నకిలీ సర్టిఫికెట్ల కేసులన్నింటినీ తలదన్నే కేసు ఇది. ఏకంగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లరే దొంగ డిగ్రీలు జారీచేసిన సంచలన కేసును హైదరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. దాదాపు మూడు నెలలపాటు అనేక రాష్ర్టాలు తిరిగి పక్కా ఆధారాలు సేకరించి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ (ఎస్‌ఆర్‌కేయూ) వైస్ చాన్స్‌లర్ ఎం ప్రశాంత్ పిళ్లె, ఇదే వర్సిటీకి 2017 నుంచి 2021 వరకు వీసీగా పనిచేసిన ఎస్‌ఎస్ కుశ్వాహను అరెస్టుచేశారు. కేసు…
ఉస్మానియ యూనివర్సీలో డిస్టేన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థుకుల కీలక ప్రకటన చేసింది ఓయూ. ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. బీఏ, బీకామ్, బీబీఏ తదితర కోర్సుల పరీక్షలను ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించినప్పటికీ, ఈ…
తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యంగా ప్రారంభం కానుంది.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 20వ తేదీ నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. జూన్ 15వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం కాబుతున్నాయి.. ఇక, జులై 1వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.. అయితే, ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది.…
తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం భ్రష్టు పట్టింది. తెలుగు విద్యార్థులు మాతృభాష పేపర్ కూడా రాయలేని దుస్థితిలో ఉన్నారు. ఏపీలో టెన్త్ తెలుగు పేపర్ లీకేజ్ కలకలం రేపింది. లీకేజీ కాదు మాల్ ప్రాక్టీస్ అని తేల్చిన ప్రభుత్వం.. వాట్సాప్ గ్రూప్ పేపర్ సర్క్యులేట్ చేసిన వారిని అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి నారాయణతో పాటు 69 మంది టీచర్లు అరెస్టయ్యారు. ఇందులో 35 మంది ప్రభుత్వ స్కూల్ టీచర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చదువంటే మార్కులే…
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయితే సహేతుక కారణాలతో లేటుగా వస్తే అనుమతించాలని నిర్ణయించారు. పదో…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ప్రతిపక్షాల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్ విపక్షాలపై విరుచుకుపడ్డారు.దేవుని దయ, ప్రజల అభిమానం ఉన్నంత వరకు నా వెంట్రుక కూడా పీకలేరు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..జిల్లా చేసి ఇక్కడికి వచ్చానన్నారు. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాం. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో…
ప్రతి పార్లమెంమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా…..జిల్లా చేసి ఇక్కడికి వచ్చా అన్నారు సీఎం జగన్. పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసాం. దరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో గాథలు విన్నా…..విద్యారంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశాం. అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చాం అన్నారు.
ఒమిక్రాన్ ఎంట్రీతో దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రారంభంమైంది.. ఇదే సమయంలో తెలంగాణలోనూ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.. ఈ నేపథ్యంలో.. సంక్రాంతి సెలవులు ముగుస్తున్న తరుణంలో సెలవులను జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, ఈ నెలతో సెలవులు ముగిసిపోనున్నాయి.. మరోవైపు.. ఆన్‌లైన్‌తో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. తిరిగి ప్రారంభించాలనే డిమాండ్ కూడా ఉంది.. దీంతో.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభించేందుకు…