అటవీభూములపై హక్కులివ్వండి.. కేటీఆర్ కి ఆదివాసీల వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అటవీ భూములపై హక్కుపత్రాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కి ఆదివాసీల ప్రతినిధులు కోరారు. ప్రగతి భవన్ లో మంత్రి కే. తారక రామారావు ని కలిసిన ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు పలు అంశాలను ప్రస్తావించారు.
తమ తెగలు ఎదుర్కొంటున్న పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కేటీఆర్ ను కోరారు.
షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యల పైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. తక్కువ సంఖ్యలో… ఎక్కువ ప్రాంతాల్లో నివాసం ఉండే ఆదివాసీలకు కు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కు సంబంధించిన సమస్యల పైన ఆయా ప్రతినిధులు, నాయకుల అభిప్రాయాలు విన్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
Also Read
ఇప్పటికే ఆదివాసీ సమస్యలపైన మా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆదివాసీ రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆదివాసులు వ్యవసాయం చేసుకుంటున్న అటవీ భూములు పైన హక్కు పత్రాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టానికి సంబంధించిన పరిమితులున్న విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ విషయంలో సాధ్యమైనంత ఎక్కువ సానుకూల దృక్పధాన్ని మా ప్రభుత్వం కలిగి ఉందని తెలిపారు. ఆదివాసీల మావ మాటే … మావ రాజ్ నినాదం స్ఫూర్తి మేరకే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు గిరిజన తండాలను, ఆదివాసీ గుడెలను గ్రామ పంచాయతీలుగా మార్చి పరిపాలనాధికారన్ని ప్రజలకు దగ్గరగా చేసిందన్నారు.
అడవి ప్రాంతంలో నివాసముండే ఆదివాసీలకు అవసరమైన వైద్య విద్యా సదుపాయాలు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు త్వరలోనే విద్య వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం అన్నారు.
విద్య వైద్య విషయాల్లో సంతృప్త స్థాయి వరకు అందరికీ నాణ్యమైన సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందడం వేగవంతమైందన్నారు. అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. గతంలో ఆదివాసీలకు వైద్య సేవల విషయంలో తీవ్రమైన అలసత్వం ఉండేది… అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగ్గిందన్నారు.
Read Also డ్రగ్స్ కేసుల్లో ఎంతటివారున్నా వదిలేది లేదు-కేసీఆర్
త్వరలోనే మరోసారి ఆదివాసీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు… మా పార్టీ ప్రజాప్రతినిధులు ఇచ్చిన విలువైన సలహాలు సూచనలను ప్రభుత్వానికి అందజేసి ఆదివాసీలకు మరింత సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్యే అత్రం సక్కు లతో పాటు పలువురు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఆదివాసి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!