మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు.
Venkaiah Naidu: బాపట్ల జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నాడు పర్యటించారు. వేటపాలెం మండలంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన 100 సంవత్సరాల పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ్ల బాపయ్య విద్యా సంస్థల శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. చీరాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. అన్ని దానాలలో విద్యాదానం చాలా గొప్పదని వెంకయ్యనాయుడు…
మెదక్ జిల్లా మనోహరాబాద్ లో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత కరెంట్ కాదు.. ఉత్త కరెంట్ అని ఎద్దేవ చేశారు. ఉచితాలు వద్దు అనే బీజేపీకి బుద్ది చెప్పాలని అన్నారు. కేసీఆర్ ది గజ్వేల్ నియోజక వర్గం కావడం మీ అదృష్టం అని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రభుత్వం మాది అని హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కూర్చున్న…
జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. విధానాన్ని తీసుకురావడం కాదు.. దానిని ఆచరించాలని ఆమె సూచించారు. విద్య ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనదని.. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్దికి విద్య అనేది ఎంతో అవసరమన్నారు. ‘ఉన్నత విద్యపై జాతీయ విద్యా విధానం-2022 యొక్క ప్రభావాలు’ అనే అంశంపై హైదరాబాద్ హైటెక్స్లోని శిల్పకళావేదికలో జరిగిన కాన్ఫరెన్స్లో ఆమె ప్రసంగించారు. చదువును మధ్యలో ఆపేవాళ్లను చాలావరకు తగ్గించగలిగామని గవర్నర్ వెల్లడించారు. కానీ…