Hyderabad:ఫేక్ సర్టిఫికెట్స్ కేసులో కీలక మలుపు.. ఇద్దరు వీసీలు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం చూసిన నకిలీ సర్టిఫికెట్ల కేసులన్నింటినీ తలదన్నే కేసు ఇది. ఏకంగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లరే దొంగ డిగ్రీలు జారీచేసిన సంచలన కేసును హైదరాబాద్ పోలీసులు పక్కా ఆధారాలతో ఛేదించారు. దాదాపు మూడు నెలలపాటు అనేక రాష్ర్టాలు తిరిగి పక్కా ఆధారాలు సేకరించి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ (ఎస్‌ఆర్‌కేయూ) వైస్ చాన్స్‌లర్ ఎం ప్రశాంత్ పిళ్లె, ఇదే వర్సిటీకి 2017 నుంచి 2021 వరకు వీసీగా పనిచేసిన ఎస్‌ఎస్ కుశ్వాహను అరెస్టుచేశారు. కేసు వివరాలను హైదరాబాద్ అదనపు సీపీ (క్రైమ్) ఏఆర్ శ్రీనివాస్ బుధవారం మీడియాకు వెళ్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని మలక్‌పేట, అసిఫ్‌నగర్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ల పరిధిలో నకిలీ సర్టిఫికెట్ల కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు బాధ్యతను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సీసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిట్ (స్పెషల్ అపరేషన్స్ టీమ్)కు అప్పగించారు. సిట్ ఏసీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని బృందాలు మూడు నెలలుగా భోపాల్‌తోపాటు ఉత్తరప్రదేశ్, చెన్నై, మధురైలోని యూనివర్సిటీల సర్టిఫికెట్ల వివరాలు సేకరించాయి.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
హైదరాబాద్‌లోని పలు ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీలు అర్హత లేనివారికి వివిధ వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందిస్తున్నాయని, వీటన్నింటికీ మూలం భోపాల్‌లోని ఎస్‌ఆర్‌కేయులో ఉన్నదని గుర్తించారు. పరీక్షలే నిర్వహించకుండా అర్హత లేనివారికి వివిధ డిగ్రీలకు చెందిన 101 సర్టిఫికెట్లు జారీచేసినట్టు కనిపెట్టారు. వాటిలో 13 డిగ్రీలు బీటెక్, బీఈలవి కూడా ఉండటం విశేషం. వీటిలో 44 సర్టిఫికెట్లను పోలీసులు సీజ్ చేసి కన్సల్టెన్సీల నిర్వాహకులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, పట్వారి శశిధర్, పీకేవీ స్వామి, గుంటి మహేశ్వర్‌రావు, అసిఫ్ అలీ, టీ రవికాంత్‌రెడ్డి, ఉప్పరి రంగరాజు, ఎస్‌ఆర్‌కేయు ప్రొఫెసర్ కేతన్‌సింగ్‌తోపాటు 19 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.
చివరగా ఈ కుట్రకంతటికీ మూలమైన ఎస్‌ఆర్‌కేయు వర్సిటీ వీసీ, మాజీ వీసీలను మంగళవారం అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో ఎంతటివారున్నా వదిలేది లేదని సీపీ ఆనంద్ హెచ్చరించారు. ఇలాంటి కేసులో వర్సిటీ వీసీని అరెస్టు చేయటం దేశంలో ఇదే మొదటిసారి అని తెలిపారు. సమావేశంలో సిట్ ఏసీపీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో పేరుగాంచిన వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఎడ్యుకేషనల్ అకాడమీలు నడుపుతున్న హనుమకొండకు చెందిన నారెడ్ల రమేశ్, దేవరాజు సుధాకర్, దాస భిక్షమయ్య రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు తీసుకొని పలువురికి నకిలీ సర్టిఫికెట్లు అందజేసినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి తెలిపారు.
దేశవ్యాప్తంగా దాదాపు 30 వర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి విద్యార్థులకు అమ్మేశారని చెప్పారు. గంజాయి కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు తెలిసిందని వెల్లడించారు. నిందితుల నుంచి 153 నకిలీ సర్టిఫికెట్లు, రబ్బరు స్టాంపులు, మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు.
F3: టికెట్ రేట్లపై గుడ్ న్యూస్ చెప్పిన దిల్‌రాజు
- Tags
- arrest
- certificates
- Education
- fake
- gang
తాజావార్తలు
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!