ఏపీలో వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అగ్రి పాలీసెట్-2022 నోటిఫికేషన్‌ను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య వర్సిటీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!
అగ్రి పాలీసెట్ పరీక్ష కోసం అప్లికేషన్ ఫీజుగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ.500 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. మే 18న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 1 వరకు అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించే అవకాశం ఉంది. జూలై 1న అగ్రి పాలీసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం www.angrau.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.