ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు ఎంతో ఆసక్తికరంగా మారాయి.చంద్రబాబు అరెస్టు జరిగిన నేపథ్యం లో టీడీపీ నిరసన కొనసాగిస్తుంది. అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా టీడిపి ఎమ్మెల్యే లు తీవ్రస్థాయి లో నిరసన తెలుపుతున్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు ఆసక్తి చూపడం లేదనీ, సభలో అధికార పార్టీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.టీడీపీ ఎమ్మెల్యే ల తీరు సరికాదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఏపి శాసన మండలిలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామనీ అలాగే మెరుగైన విద్యాను రాష్ట్రం లో అందిస్తున్నామని ఆయన చెప్పారు.
చంద్రబాబు అరెస్టు పై టీడీపీ సభ్యులు ప్రవర్తన పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు అంతరాయం కలిగించడం సబబు కాదని చంద్రబాబు అరెస్టుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.చంద్రబాడు అరెస్టు తో పాటు ఏ అంశమైన చర్చకు సిద్ధమనీ, దాని కోసం ఎంత సమయమైన తాము ఇస్తామని తెలిపారు. కావాలనే టీడీపీ సభ్యులు మమ్మల్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. చైర్మన్ పై దౌర్జ్యన్యానికి దిగడం సరికాదని ఆయన అన్నారు.ఇదిలా ఉంటే మంత్రి బొత్స టీచర్ పోస్టుల ప్రకటనపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో 40 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని చెప్పారని అన్నారు. అయితే, మంత్రి బొత్స మాత్రం 8 వేల టీచర్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారనీ, ఇది సరికాదని ఆయన విమర్శించారు. త్వరగా ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
.