టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ళ స్థలాలను సమాధికి పనికి వస్తుందని చెప్పటం చంద్రబాబు అహంకారానికి అద్దం పడుతుంది అంటూ ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నాడు.. సందర్భాన్ని బట్టి తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అప్పట్లో 40 వేలు ఇచ్చే వాళ్ళం.. ఇప్పుడు లక్షా 80 వేలు ఇస్తున్నామని బొత్స తెలిపారు. ఎస్ఎఫ్‌టీ మార్పులు రాకపోయినా నిర్మాణ ధరలు పెరిగాయి.. రాజకీయాల్లో సమాధులు వంటి మాటలు మాట్లాడవచ్చా.. అంటూ చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు. మేం కాన్ఫిడెంట్ గా ఉన్నాం…తుది తీర్పు కూడా పేద ప్రజలకు అనుకూలంగా ఉంటుందని.. చంద్రబాబు ఎవరిని కలిసి రమ్మంటున్నాడో చూద్దాం అని ఆయన అన్నారు.
Also Read : Telangana Cabinet : 111 జీవో ఎత్తివేత.. VRAల రెగ్యులర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం.. వారిపై పీడీయాక్ట్..
పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో.. ఈ నెల 23వ తేదీకి బదులు 25వ తేదీన బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముందు 23వ తేదీన ఎంసెట్ ఎక్సామ్ ఉండటం వల్ల ఈ మార్పు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, స్కూల్ హెడ్మాస్టర్లను కూడా సత్కరించాలని నిర్ణయించామన్నారు.
Also Read : Sriram Adithya: రేపు పెళ్లి పెట్టుకొని.. పవన్ సినిమాకు వెళ్ళా…
నియోజకవర్గ స్థాయిలో మొదటి స్థానం వచ్చిన విద్యార్థులకు 15 వేల క్యాష్ అవార్డు, రెండో స్థానం వచ్చిన విద్యార్థులకు 10 వేలు, మూడో స్థానం వచ్చిన విద్యార్థులకు 5 వేల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు మంత్రి బొత్స తెలిపారు. 27వ తేదీన జిల్లా స్థాయిలో విద్యార్థులకు పురస్కారాలు ఇస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చిన వారికి లక్ష రూపాయలు, రెండో స్థానానికి 75 వేలు, మూడో స్థానానికి 50 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Also Read : New York Sinking: నేలలో కూరుకుపోతున్న న్యూయార్క్ నగరం.. తాజా అధ్యయనంలో వెల్లడి..
జగనన్న ఆణిముత్యాలు.. స్టేట్ బ్రిలియంట్స్ అవార్డు పేరుతో ప్రతిభావంతులైన విద్యార్ధులను సన్మానించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు జీవో కూడా విడుదల అవుతుంది.. మొత్తంగా 2 వేల 8 మంది విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 31న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి బహుమతుల ప్రదానం కార్యక్రమం ఉంటుంది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.