బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు..
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో రానా ఇప్పటికే విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకి ఆయనను ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ED ఆదేశించింది. ఈ రోజు (జులై 23, 2025) ED ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, రానా సమయం కోరడంతో మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. బెట్టింగ్ యాప్స్‌తో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలపై ED దర్యాప్తు చేస్తోంది.…
వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. యూకేకు చెందిన ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది.
ED Summons Robert Vadra: వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానా రాష్ట్రంలోని శిఖోపూర్ భూ ఒప్పందంలో తన సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీకి సంబంధించిన ఆర్థిక అవకతవకలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తున్నంది.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసు ఇంకా వదలడం లేదు, అడల్ట్ చిత్రాల పంపిణీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వారంలో దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కుంద్రాను కోరింది. 49 ఏళ్ల కుంద్రా సహా మరి కొందరు వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలతో సహా ముంబై మరియు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో సుమారు 15 ప్రదేశాలలో ED దాడులు నిర్వహించిన తర్వాత సమన్లు…
Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు.
టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభ కోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఎన్ ఫోర్స్మెంట్ (ఈడీ) ఇవాళ (మంగళవారం) నోటీసులు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టు చేయకుండా నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. బలవంతపు అరెస్ట్ లకు దిగవద్దని ఈడీని ఆదేశించాలని కోర్టును ఆయన కోరారు.