Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు..
- మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ కు ఈడీ నోటీసులు..
- ఈడీ నోటీసులపై మండిపడిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుపెండా మెయిటీ..
- కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు: బుపెండా మెయిటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు. కేంద్రంలో, మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిర్భయంగా ఆందోళనలు చేయడంలో మేఘచంద్ర కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. మే 2023 నుంచి రాష్ట్రంలో కొనసాగుతున్న గందరగోళాల మధ్య ఈ ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపుతూ మేఘచంద్ర ప్రజలకు బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారని బుపెండా మెయిటే పేర్కొన్నారు.
Read Also: Mushrooms: పుట్టగొడుగులు ఆరోగ్యానికి మంచివేనా? మరి ఏ రకమైన వాటిని తినడం మంచిది?
Also Read
ఇక, కాంగ్రెస్ నేతలపై ఈడీ పగ, వేధింపులు, ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని మణిపూర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే ఆరోపించారు. మణిపూర్‌లో తమ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని సందర్శించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరించడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈడీ, సీబీఐ కేసులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు.. రాహుల్ గాంధీ నిర్భయమైన నాయకుడు.. ఈ ఈడీ సమన్లు మమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచలేవన్నారు. తాము రాష్ట్ర, దేశ ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేస్తామన్నారు. డబుల్- ఇంజిన్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని బుపెండా మెయిటీ విమర్శలు గుప్పించారు. మణిపూర్ పీసీసీ చీఫ్ మేఘచంద్ర ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన న్యూ ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు మేఘచంద్ర సింగ్ సోమవారం వెళ్లలేదు.
- Tags
- bjp
- CBI
- congress
- ED
- ED summons
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు