ED Summons Robert Vadra: వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానా రాష్ట్రంలోని శిఖోపూర్ భూ ఒప్పందంలో తన సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీకి సంబంధించిన ఆర్థిక అవకతవకలను కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలిస్తున్నంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 15న) రాబర్ట్ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రెండవ సారి సమన్లు పంపింది. ఇక, ఏప్రిల్ 8వ తేదీన జారీ చేసిన మొదటి సమన్లకు ఆయన ఇప్పటికే గైర్హాజరు అయ్యారు. ఇక, విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని అతడికి ఆదేశాలు జారీ చేసింది.
Read Also: SLBC Tunnel: చివరి దశకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. ఇంకా లభించని ఆరు మృతదేహాలు
అయితే, రాబర్ట్ వాద్రా కంపెనీ ఫిబ్రవరి 2008లో గుర్గావ్‌లోని శికోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత వాద్రా కంపెనీ ఆ భూమిని రూ.58 కోట్లకు రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌కు విక్రయించింది. దీంతో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు అనుమానిస్తున్న ఈడీ.. ఆకస్మిక లాభాల వెనుక ఉన్న డబ్బు జాడను కేంద్ర ఏజెన్సీ పరిశీలిస్తోంది.