బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసు ఇంకా వదలడం లేదు, అడల్ట్ చిత్రాల పంపిణీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వారంలో దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కుంద్రాను కోరింది. 49 ఏళ్ల కుంద్రా సహా మరి కొందరు వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలతో సహా ముంబై మరియు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో సుమారు 15 ప్రదేశాలలో ED దాడులు నిర్వహించిన తర్వాత సమన్లు జారీ చేయబడ్డాయి. ఈ కేసుకు సంబంధించిన ఇతర వ్యక్తులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. వారిని విచారణ కోసం ముంబై కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని రాజ్ కుంద్రాను కోరింది. రాజ్ కుంద్రా తరపు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ తన క్లయింట్ ఎలాంటి నేరం చేయలేదని అన్నారు. ‘నేను ఇంకా నా క్లయింట్‌తో మాట్లాడలేదు, కానీ అతను నిర్దోషి అని నేను మీకు చెప్పగలను. ముంబై పోలీసుల ఛార్జ్ షీట్ చూస్తే రాజ్ కుంద్రా లావాదేవీలు చట్టబద్ధంగా ఉన్నాయి.
Pushpa 2 : ఆ రికార్డులు పుష్ప 2కే సొంతం
రాజ్ కుంద్రా మనీలాండరింగ్ వంటి ఎలాంటి నేరం చేయలేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. మే 2022లో రాజ్ కుంద్రా మరియు ఇతరులపై ముంబై పోలీసులు దాఖలు చేసిన కనీసం రెండు ఎఫ్‌ఐఆర్‌లు -ఛార్జ్ షీట్‌ల అనంతరం మనీలాండరింగ్ కేసు కూడా తెర మీదకు వచ్చింది. ఈ కేసులో వ్యాపారవేత్తతో పాటు మరికొందరిని కూడా అరెస్టు చేశారు, ఆ తర్వాత వారు కోర్టు నుండి బెయిల్ పొందారు. కుంద్రాపై మనీలాండరింగ్‌లో ఇది రెండో కేసు. ఈ ఏడాది ప్రారంభంలో క్రిప్టో కరెన్సీ కేసులో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టికి చెందిన రూ.98 కోట్ల ఆస్తులు ఈడీ జప్తు చేసింది. అయితే, తన ఆస్తులను అటాచ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టు నుంచి ఉపశమనం పొందారు. ఇక ఈ పోర్న్ ఫిల్మ్ రాకెట్‌లో ఉపయోగించిన ‘హాట్‌షాట్స్’ యాప్‌ను చట్టం ప్రకారం నేరంగా పరిగణించడానికి ప్రాసిక్యూషన్ (ముంబయి పోలీసులు) వద్ద ఒక చిన్న సాక్ష్యం కూడా లేదని రాజ్ కుంద్రా 2021లో ముంబైలోని స్థానిక కోర్టుకు తెలిపారు. ‘హాట్‌షాట్స్’ యాప్‌ను నిందితులు అసభ్యకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి మరియు ప్రసారం చేయడానికి ఉపయోగిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.