ఢిల్లీ పేలుడు దర్యాప్తులో భాగంగా మంగళవారం ఉదయం ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందాలు దాడులు చేస్తున్నాయి. యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం, 25 ప్రదేశాలపై ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైదరాబాద్‌లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని SK కార్ లౌంజ్‌తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ ఈ దాడులు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన రూ. 4000 కోట్ల లిక్కర్ స్కాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, హైదరాబాద్ జోనల్ ఆఫీస్ భారీ దాడులు నిర్వహించింది. పీఎంఎల్‌ఏ చట్టం, 2002 కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, ఆంధ్రప్రదేశ్‌లోని 20 ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. Also Read:Vikarabad : వికారాబాద్ పూడూర్‌లో పనిమనిషిని మోసగించి భూమి కాజేసిన యజమానులు స్కాం వివరాలు ఏపీ సీఐడీ ఇప్పటికే ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2019…
రూ.3500 కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనిఖీలు చేపట్టింది. శుక్రవారం ఉదయం ఏకకాలంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలలోని 20 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మద్యం కుంభకోణం నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ స్కాంలో ఉన్న నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిగాయి. నకిలీ ఇన్వాయిస్‌లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కాం…
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులు చేస్తోంది. ఆస్పత్రి నిర్మాణ కుంభకోణంలో సౌరభ్ భరద్వాజ్ నివాసం, మరో 12 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేస్తున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో 13 చోట్ల దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Anil Ambani: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాక్ ఇచ్చింది. రూ.3,000 కోట్ల లోన్ మోసం కేసుకు సంబంధించి ఈడీ తాజాగా లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. గురువారం అనిల్ అంబానీకి విచారణకు హాజరుకావాలని సమన్లు పంపిన ఈడీ, మరుసటి రోజే నోటీసులు జారీ చేయడం గమనార్హం. అసలు లుక్ అవుట్ నోటీసులు అంటే.. సంబంధిత వ్యక్తి దేశాన్ని వదిలి వెళ్లకుండా ఉండటానికి తీసుకునే చర్య. Jammu Kashmir:…
Telangana Sheep Distribution Scam : తెలంగాణలో అమలైన “గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం (SRDS)”లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002 కింద దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తులో పలువురు ప్రభుత్వ అధికారులు, మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తుల పాత్ర బయటపడింది. ఈడీ హైదరాబాద్ జోన్ కార్యాలయం జూలై 30న నిర్వహించిన సోదాల్లో ముఖ్యంగా…
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసు వ్యవహారం కర్ణాటక ప్రభుత్వానికి చుట్టుకుంటోంది. కేబినెట్లో కీలక నేత, హోంమంత్రి పరమేశ్వర సంస్థలపై బుధవారం నుంచి ఈడీ దాడులు చేస్తోంది. అలాగే మంత్రిని కూడా ప్రశ్నించారు.
Ranya Rao Gold Smuggling Case: బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ దొరికిపోయిన నటి రన్యా రావు కేసులో కీలక ఈడీ దూకుడు పెంచింది. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరతో సంబంధం ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కాలేజీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు చేస్తుంది.