Mamat Banerjee: ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు.. మమత బెనర్జీ పరుగో పరుగు.. చేతిలో ‘‘గ్రీన్ ఫైల్’’
- సంచలనంగా ఈడీ కోల్‌కతా దాడులు..
- ఐ-ప్యాక్ దాడితో, మమతా బెనర్జీ పరుగులు..
- బ్యాక్ డోర్ గుండా ఐ ప్యాక్ ఆఫీస్‌లోకి ఎంట్రీ..
- కీలకంగా మారిన గ్రీన్ ఫైల్..
- మమత తీసుకెళ్లిన ఫైళ్లలో ఏముంది.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamat Banerjee: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్‌లో ఈడీ సంచలన దాడులు నిర్వహించింది. సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా ఈడీ దాడులు టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ ఏకకాలంలో ఈ రోజు దాడులు చేసింది. ఐ-ప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం, సాల్ట్ లేక్ ప్రాంతంలోని ఆఫీస్‌లో సోదాలు జరిగాయి.
Read Also: Bangladesh: దీపు చంద్ర దాస్ హత్యలో కీలక నిందితుడి అరెస్ట్.. మసీదు బోధకుడే సూత్రధారి..
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఐ-ప్యాక్‌తో టీఎంసీ మంచి సంబంధాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఐ ప్యాక్ పనిచేసింది. ఈడీ దాడుల సమయంలో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ హుటాహుటిన జైన్ నివాసానికి వెళ్లారు. కొద్దిసేపటికే అక్కడికి సీఎం మమతా బెనర్జీ చేరుకోవడం సంచలనంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత, ఆమె చేతిలో గ్రీన్ ఫైల్ ఉండటం, కంగారుగా కనిపించడం వైరల్ అయింది. ఈ దాడుల గురించి మాట్లాడుతూ.. ఇది రాజకీయ ప్రేరేపితమని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇది జరిగిందని ఆరోపించారు. తృణమూల్ ఎన్నికల వ్యూహాలను, 2026 ఎన్నికల అభ్యర్థల జాబితాను, పార్టీ రహస్య పత్రాలను పొందేందుకే ఈ దాడులు చేసినట్లు ఆమె ఆరోపించింది. ఎన్నికల వ్యూహాల ఫైళ్లను దొంగలించడానికి ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు.
జైన్ నివానం నుంచి, నేరుగా సాల్ట్ లేక్ ప్రాంతంలోని దాని కార్యాలయం వద్దకు చేరుకున్న మమతా బెనర్జీ, వెనక ద్వారం నుంచి ఆఫీసులోకి వెళ్లారు. 15-20 నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చారు. ఆమెతో సీఎంఓ అధికారులు అనేక ఫైళ్లను పట్టుకెళ్లడం కనిపించింది. మమత వచ్చిన కారు వెనకలో ఈ ఫైళ్లను ఉంచారు. అయితే, ఈ సోదాలు మనీలాండరింగ్‌కు సంబంధించినవి అని ఈడీ చెబుతోంది. ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ, ఆమె సిబ్బంది రాష్ట్ర పోలీసులు ఫిజికల్ పేపర్స్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తొలగించారని ఈడీ పేర్కొంది. ఇప్పుడు మమత తీసుకెళ్లిన ఫైళ్లలో ఏమందనేది ఆసక్తికరంగా మారింది. ఒక ఫైల్‌పై ‘‘ఫిబ్రవరి 2022’’గా ఉంది, మరో ఫైల్‌లో టీఎంసీ నాయకుల ప్రయాణ వివరాలు ఉన్నాయి. మరో పేపర్‌లో ‘‘మహువా మోయిత్రా x 1’’ అని ఉంది.
🚨 ED की छापेमारी में I-PAC कार्यालय और उसके प्रमुख प्रतीक जैन का आवास जांच के दायरे में आया।
जांच के दौरान मुख्यमंत्री ममता बनर्जी का स्वयं मौके पर पहुंचकर पार्टी के दस्तावेज़ और हार्ड डिस्क समेटना बेहद गंभीर सवाल खड़े करता है।
अगर पश्चिम बंगाल में कुछ भी गलत नहीं हो रहा , तो एक… pic.twitter.com/ZVDjamEhhZ— संस्कृति (@HinduHeritage__) January 8, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?