ED Raids : లగ్జరీ కార్ల వెనకున్న బసరత్ ఖాన్ రహస్యాలు..?
- లగ్జరీ కార్ డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఈడీ సోదాలు..
- ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పై ఇప్పటికే ఈడీ కేసు నమోదు..
- బసరత్ ఖాన్ ఇప్పటికే అరెస్టు చేసిన అహ్మదాబాద్ ఈ డి అధికారులు.
- హైదరాబాదులో లగ్జరీ ఇంపార్టెంట్ కార్ల విక్రయాల డీలర్ గా ఉన్న బసరత్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Raids : హైదరాబాద్‌లోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని SK కార్ లౌంజ్‌తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ ఈ దాడులు జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో భాగంగా, స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసిన హైఎండ్ కార్ల వ్యవహారాలపై అధికారులు ఈ సోదాలు చేపట్టారు.
బసరత్ ఖాన్ ఇప్పటికే అహ్మదాబాద్ ఈడీ అధికారుల చేత అరెస్టు కాగా, గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. అమెరికా, జపాన్ నుండి దిగుమతి చేసిన లగ్జరీ కార్లను దుబాయ్, శ్రీలంక మార్గం ద్వారా తెచ్చి, ఎడమ స్టీరింగ్ వాహనాలను కుడివైపు స్టీరింగ్‌గా మార్చి, తక్కువ ధరకు డిక్లేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తప్పుడు డాక్యుమెంట్ల కారణంగా ప్రభుత్వానికి దాదాపు ₹25 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. విచారణలో ఖాన్ అనేక వాహనాలను అండర్వాల్యూ చేసినట్లు అంగీకరించాడు. టయోటా ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయిస్ కలినన్, లెక్సస్ LX-500D వంటి కార్లను తక్కువ ధరకు చూపించానని, ఎనిమిది వాహనాలపై తక్కువగా చెల్లించిన డ్యూటీ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సమయం కావాలని అధికారులకు తెలిపాడు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
ఈ వ్యవహారం రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్—“కార్ పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా? KTR ఎందుకు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్‌లో కనిపిస్తున్నాడు?” అంటూ ప్రశ్నించారు. దీనిపై బిఆర్ఎస్ నేతలు స్పందిస్తూ, “ఆ కార్ సాధారణ కొనుగోలు ప్రక్రియలోనే తీసుకున్నారు. అదే ఖాన్ వద్ద నుండి కాంగ్రెస్ మంత్రి కూడా వాహనం కొనుగోలు చేశారు. దానిని ఎందుకు ప్రస్తావించడం లేదు?” అని ప్రతిఉత్తరం ఇచ్చారు.
దర్యాప్తులో మాజీ బిఆర్ఎస్ మంత్రితో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక సిట్టింగ్ మంత్రి కూడా ఖాన్ వద్ద నుండి లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం బయటపడింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య వాదోపవాదాలు ముదురుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈడీ, DRI దర్యాప్తులు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!